in , ,

తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్మేస్థితిలో లేరు”

tdp

రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే. సీఎం జగన్ పని అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి ఆయన ఆనందపడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విశాఖలో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది, చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు, దేశంలో ఏ ఒక్కరిని అడిగినా ఆయన దార్శనికతను చెబుతారన్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నందున.. ఒక్కరోజైనా చంద్రబాబును అలా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. పరిపాలనపై అవగాహన ఉన్న కొంతమంది సీనియర్ మంత్రులైనా ఇది సరికాదని మూర్ఖపు ముఖ్యమంత్రికి చెప్పాలి. తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇంతకంటే ఎక్కువగా మీరు అనుభవిస్తారు అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పీక కోసుకొంటా..

నా అకౌంట్ లోకి కానీ లేక నా కుటుంబ సభ్యులకు కానీ.. లేక మా నాయకుడు చంద్రబాబు, వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి ఒక్క పైసా అక్రమంగా వచ్చినట్టు నిరూపిస్తే పీక కోసుకుంటానని అచ్చెన్నాయుడు తెలిపారు.టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు విశాఖపట్నం, న్యూస్ లీడర్, సెప్టెంబర్ 10: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీరన్ను కలవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ రద్దు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ పర్యటనలో భాగంగా పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. శనివారం రాత్రి 7.30 గంటలకు ఆయనను కలవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మూజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితర నేతలు ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఆదివారం ఉదయం 9.45 గంటలకు అపాయింట్ మెంట్ కోరారు. అయితే, చంద్రబాబు వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ అపాయింట్మెంట్ను రద్దు చేశారు.

[zombify_post]

Written by Prasad

వ్యాధి నిరోధక టీకాలు అందించాలి”

అరెస్టులూ.. నిర్బంధాలు..”