in , ,

చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్

మల్యాల మండలానికి చెందిన రైతులు, బీఅర్ఎస్ నాయకులు మంగళవారం చొప్పదండి నియోజక వర్గం ఇంఛార్జి మేడిపల్లి సత్యం, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అద్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి,మండల అధ్యక్షుడు దొంగ ఆనంద రెడ్డి, మాజీ ఎంపీపీ దారం ఆదిరెడ్డి అధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు.కొమ్ముల సుదర్శన్ రెడ్డి, కొమ్ముల మహేశ్వర రెడ్డి, కమలాకర్ రెడ్డి,మల్యాల సింగిల్ విండో డైరెక్టర్ సంత ప్రకాష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సంత శ్రీధర్ రెడ్డి, తదితరులకు
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీ లోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…
కాంగ్రెస్ అభయ హస్తం పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను ఇంటింటికి తీసుకెల్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

[zombify_post]

Report

What do you think?

Written by Gopi

దహన సంస్కారాలకు 16 వేలు అందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

చంద్రబాబుని విడుదల చేయాలంటూ దీక్షలు