in ,

చేతి వృత్తుల వారికీ ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుంది వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్

గురు న్యూస్ విశాఖపట్నం:చేతి వృత్తుల పని వారికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. చేతివృత్తుల వారిని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పీఎం విశ్వకర్మ కార్యక్రమం స్థానిక సాగరమాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ చేతివృత్తుల వారికి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జి20 సమావేశాలు భారతదేశంలో విజయవంతంగా నిర్వహించి ప్రధాని మోదీ ప్రపంచదేశాల నాయకుల అభిమానాన్ని చూరగున్నారని అయన అన్నారు.దేశంలో చేతి వృత్తుల పనివారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆయా ప్రాంతాలకు ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకు వస్తున్నారని మంత్రి అమర్నాథ్ అన్నారు. దేశంలో లక్షలాదిమందికి కేంద్ర ప్రభుత్వం 13 వేల కోట్లకు పైగా ఆర్థిక సహకారం అందిస్తోందని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన చేతివృత్తుల కుటుంబాల్లోని వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు వర్తిస్తాయని, వాటినిసద్వినియోగం చేసుకోవాలని అమర్నాథ్ సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతివృత్తుల వారికి చేదోడు పథకం కింద సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయని ఆయన చెప్పారు. చేతివృత్తులలో ప్రతిభ కనబరిచి పద్మశ్రీ పద్మ, విభూషణ్ లు అందుకున్న వారు కూడా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్ సింగ్ చౌహన్ పలువురు నేతలు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Balakishan

తొమ్మిది మందికి కారుణ్య నియామ‌క ఉత్త‌ర్వులు

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి