in , ,

చంద్రబాబు….మీరు పోలీస్ కస్టడీలో లేరు

జైలులో ఉంచి తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తన హక్కులను రక్షించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ”మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. మీరు దీన్ని శిక్షగా భావించొద్దు. మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే.. నేరనిరూపణ కాలేదు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్‌ విధించాం. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశిస్తాం. మీరు 24 వరకు జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉంటారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు. చట్టం ముందు అందరూ సమానమే” అని చెప్పారు.

టీడీపీ నాయకుడు బేబీ నయన అరెస్ట్

ఔషద గుణాలు నల్లేరు… రాజమండ్రి మార్కెట్లో…