in ,

చంద్రబాబు అరెస్ట్ పై గలామెత్తిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

గురు న్యూస్ విశాఖపట్నం :. విజ్ఞానం లో దేశాన్ని అగ్రగామిగా నిలపాలని శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ ను కక్షగట్టి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపినట్టే 45 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమకేసు పెట్టి జైలుకు పంపారు. తద్వారా యువతకు ఏం సందేశం ఇస్తున్నారు అని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. పార్లమెంట్ సమావేశం లో మాట్లాడుతూ నా లాంటి ఎంతో మంది యువత కి చంద్రబాబు గారు ఆదర్శమని ఈ రోజు అయన ని అక్రమ అరెస్ట్ చేయించడం ఒక నీతిమాలిన చర్యా అని పార్లమెంట్ లో ప్రస్థావించారు. దాదాపు 43 వేల కోట్ల దొచేస్తే 16 నెలలు జైల్లో ఉన్న వారు చంద్రబాబు నాయుడు గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు అని అన్నారు. స్పీకర్ ను ఉద్దేశిస్తూ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ నేను మాట్లాడే దంట్లో తప్పు ఉంటే నా పై మీరు ఏ చర్యలు తీసుకున్న దానికి నేను సిద్దమే అని ఆయన తెలిపారు.

Written by Balakishan

ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జగదీష్ రెడ్డి