in

కక్షసాధింపు రాజకీయాలకు వేదికగా ఏపీ: సీపీఐ రామకృష్ణ

తిరుపతి: చంద్రబాబు అరెస్ట్‌ (Chandrababu Arrest) నేపథ్యంలో రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు..

తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపుతామని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షసాధింపు రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారిందని ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే సీఎం జగన్‌కు ప్రతీకారం తీర్చుకోవడమే ప్రాధాన్యమైపోయిందని దుయ్యబట్టారు.

సీఐడీ తీరుపైనా రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ జగన్‌ ప్రైవేట్‌ సైన్యంగా వ్యవహరిస్తోందన్నారు. రెండేళ్ల నుంచి చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. పోలీసుల రాజ్యంలో విలువలు పతనమవుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు..

[zombify_post]

Written by Allagadda CM news

తెలంగాణ భూమి పుత్రుడు కాళోజీ రావు… -లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మంచే రమేష్.

ఎన్ఐఏ ఎందుకొచ్చింది?