in ,

ఓటరు సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలి

రెండవ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు నిర్వహించాలని ఓటరు జాబితా పరిశీలకులు, మునిసిపల్ పరిపాలన, పట్టణ అభివృధి కార్యదర్శి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. రెండవ ప్రత్యేక ఓటరు నమోదు 2023 లో భాగంగా మంగళవారం రోజున జగిత్యాల జిల్లాలో ఆయన పర్యటించారు.మొదట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర లు పరిశీలకులకు స్వాగతం పలికారు. జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమాలు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం పట్టణంలోని 163 వ పోలింగ్ కేంద్రం, బుగ్గారం మండలంలోని చిన్నపూర్ గ్రామంలోని 57 వ పోలింగ్ కేంద్రాలను పరిశీలకులు పరిశీలించి, ఓటరు నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపు లకు సంబంధించిన రికార్డుల పరిశీలించి, వివరాలను సంభందిత బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  పరిశీలకుల వెంట ఆర్డీఓ నరసింహ మూర్తి, తహశీల్దార్లు నరేష్, మాజిద్, తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Gopi

ఆరోగ్య శ్రీ తో మరిన్ని సేవలు అందుబాటులోకి మంత్రి విడదల రజిని

Tomorrow holiday Telangana