గురు న్యూస్ విశాఖపట్నం : గడిచిన నాలుగున్నరేళ్ళలో రాజధాని కోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా.. ఈ చివరి 100 రోజుల సమయంలో విశాఖలో కాపురం అంటూ హడావుడి ఎందుకు… ఇది ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదు, అని జగన్ పై ధ్వజమెత్తరు విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస్ రావు గారు. బాబు కోసం మేము సైతం అంటు రిలే నిరాహార దీక్షలు మొదలు పెట్టారు అయన. తన పార్టీ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రశాంత విశాఖ కు రాజధాని తెస్తారో లేదో తెలియదు కానీ… రౌడీల రాజ్యం మాత్రం ఇప్పటికే తెచ్చేశారు అని అన్నారు.రాజధాని అనే ప్రకటనకే విశాఖ రణరంగ క్షేత్రాన్ని తలపిస్తుంటే… ఇక పూర్తిస్థాయిలో రాజదాన్ని తరలిస్తే విశాఖ పరిస్థితి వర్ణనాతీతం.అని అయన వైసీపీ పాలనా ను దుయ్యబాట్టారు. ఆయన మాట్లాడుతూ మీరు చేస్తున్నా రాజధాని ప్రచారంతో ఇప్పటికే విశాఖలో చోటామోటా భూమాఫియాలు స్వైర విహారం చేస్తున్నాయి…భూదందాల్లో రౌడీ షీటర్లదే రాజ్యం గా మారిపోయింది. ప్రాంతాల వారీగా పంచుకుని పంచాయితీలు చేస్తున్నారు, అని ఘాటుగ స్పందించారు విశాఖలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి… పారదర్శకత, జవాబుదారీతనం లోపించి పాలన అరాచక స్థాయికి చేరింది…గడిచిన నాలుగున్నరేళ్లు వరకు విశాఖ సాగరతీరంలో నగర ప్రజలు ప్రశాంతంగా నిద్ర పోయేవారు… కానీ మీరొచ్చాక భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలతో నగరం ఉలిక్కిపడుతోంది, అని అన్నారు.విశాఖలో కొత్తగా గ్యాంగ్‌వార్ సంస్కృతీకి తెరలేపారు… నేరాల సంఖ్య పెరిగిపోయి ప్రశాంత విశాఖ నగరంలో అశాంతి రేకెత్తెలా చేశారు…విశాఖలో సాక్షాత్తూ అధికార పార్టీ పార్లమెంట్ సభ్యుడి కుటుంబాన్ని అరాచక శక్తులు కిడ్నాప్ చేశాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖలో ఉన్నరోజే కిడ్నాప్‌కు పథక రచన జరిగిందంటే విశాఖ లో రౌడీల రాజ్యం నడుస్తోందనటానికి ఏపీ జీవ నాడి పోలవరాన్ని అటకెక్కించారు..చీకటి జీవో నెం.1ని తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశరు అని అన్నారు.రుషికొండను బోడిగుండుగా మార్చి సర్వ నాశనం చేశారు…ఏజెన్సీలో గంజాయిసాగు, అక్రమ మైనింగ్‌తో పాటు విశాఖలో 40వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారు అని అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!