in ,

ఈనెల 25న విజయవాడలో అంగన్వాడీల ధర్నా

గొలుగొండ.అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని,గ్రాడ్యుటి అమలు చేయాలని మరియు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 25న విజయవాడలో సిఐటియు,ఏఐటియుసి,ఐఎఫ్టియు సంస్థల అంగన్వాడి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సామూహిక ధర్నా చేస్తున్నామని మండల నాయకులు మంగ తెలిపారు.ఈమేరకు శనివారం ధర్నా నోటీసు అధికారులకు అందజేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని ఈసందర్భంగా డిమాండ్ చేశారు. ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017 టీఏలు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని, అలాగే వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్ ను కూడా ప్రభుత్వ సరపర చేయాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. ఈనెల 21వ తేదీ నుండి ఏపీలో జరుగు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్ కనీస వేతనాలు చెల్లించాలని, తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by N.Chiranjeevi

కొత్తపేట లో అన్నదమ్ములు కలిసినట్టేనా..

నాడు జగన్ కు న్యాయం… నేడు బాబుకు అన్యాయమా!