అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో విప్పలపాలెం, చోద్యం గ్రామం మీదగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 23 నాటు బండ్లును, ఒక ట్రాక్టర్ను, ఆరు కాలి నాటు బండ్లును పట్టుకొని సీజ్ చేయడం జరిగిందని మండల ఇంచార్జ్ తహసీల్దార్ జి.ఆనంద్ తెలిపారు.ఈసందర్బంగా తాహసిల్దార్ జి.ఆనంద్ మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు వీటిపై పోలీసుల కలిసి దాడి చేసి పట్టుకున్నమని, అలాగే వీటిని కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.