ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్యే రసమయి విస్తృత పర్యటన..
– ఘనస్వాగతం పలికిన ప్రజలు, ప్రజాప్రతినిధులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో ఆదివారం ప్రజాబంధు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే
రసమయి బాలకిషన్ విస్తృతంగా పర్యటించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, నూతన గ్రామపంచాయితీ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారబోత్సవాలు, శంకుస్థాపనలు చేసి, అనంతగిరి ముత్యాల పోచమ్మ దేవస్థానం చైర్మేన్, నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవంలో పాల్గొన్నారు.
[zombify_post]


