జగిత్యాల పట్టణానికి చెందిన గొల్లపల్లి రోడ్, మోతె శివారులో ఉన్న 557-సర్వే నంబర్ల్ లో గల 2.30.గుంటల హిందూ స్మశాన వాటిక అన్యాక్రాంతం అవుతుందని, ప్రస్తుతం బౌండరీ 15 గుంటల నుంచి 20 గుంటలే ఉందని. ఆ స్మశానవాటిక భూమిని కాపాడాలని హిందు వాహిని ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్ కు పిర్యాదు చేసారు.విషయాన్ని సానుకూలంగా స్పందించిన కలెక్టర్ యస్మిన్ బాషా అధికారులకు తగు చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా హిందు వాహిని నాయకులు మాట్లాడుతూ 557సర్వే నంబర్ లో ఉన్నటువంటి 2.30గుంటల హిందూ స్మశాన వాటిక స్థలాన్ని తిరిగి హిందువులకు రెండు ఎకరాల 30 గుంటల బౌండ్రిని ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రాంత సంపర్గా సహ ప్రముఖ వేముల సంతోష్, కమిటీ సభ్యులు విష్ణు, బోగే సాయి,రవీందర్, వికాస్ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]


