in ,

అరుకు ఎమ్మెల్యే ఫాల్గుణ తీరుతో పార్టీకి తీవ్రనష్టం

అరకులోయ, అల్లూరి సీతారామరాజు జిల్లా:ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ విధానాలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్యలింగం అన్నారు. నియోజకవర్గంలోని అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని పలువురు వైకాపా నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులతో అరకులోయ పెదలబుడు సమీపంలోని గిరి గ్రామదర్శిని సమీపంలోని కాటేజీల వద్ద సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఫాల్గుణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేతలు పలు విమర్శలు చేశారు. మత్స్యలింగం మాట్లాడుతూ ఉద్యోగానికి రాజీనామా చేసి, గత ఎన్నికల ముందు పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్యేగా ఫాల్గుణ విజయానికి కృషి చేశానన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా కొత్త వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి, పార్టీ అభివృద్ధికి కృషిచేసిన పాతక్యాడర్‌ను దూరం చేశారన్నారు.

[zombify_post]

Report

What do you think?

గుర్తు తెలియని జంతువు దాడిలో 10 మేక పిల్లలు మృత్యువాత

సివిల్, క్రిమినల్ కేసులకు శాశ్వత పరిష్కారం