in , ,

అమ్మవారి రూపంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రాన్ని గీసి నిరసన

శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి రూపంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రాన్ని గీసి, కవిత  మాస్కులు ధరించి నిరసన తెలిపిన సమగ్ర శిక్షా ఉద్యొగులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట  తమను రెగ్యూలరైజే చేయాలనీ 11వ రోజు కొనాగుతున్న సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల నిరసన దీక్షలు…నేడు శ్రావణ శుక్రవారం సందర్బంగా అమ్మవారి రూపంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రాన్ని గీసి, వాయినాలు ఇచ్చి, పూజలు నిర్వహించి , కవిత  మాస్కులు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా ఉద్యొగులు మాట్లాడుతూ… తమ ఉద్యొగాలను క్రమబద్ధీకరించాలని ఎన్నో రోజులుగా వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం తమ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కవిత ను తమ ఇంటి  అడా బిడ్డ గా చూసుకుంటూ వైయనాలు ఇచ్చామని,    ఎమ్మెల్సీ కవిత చొరవ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేలా  చేయాలని కోరారు.

[zombify_post]

Report

What do you think?

Written by Harish

సత్యసాయి జిల్లా కొత్త చెరువు లో జనసేన కిట్లు పంపిణీ.

ఎన్నికల వాతావరణం వచ్చేసింది…”