ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వం త్వరలో అంగన్వాడీలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు అలాగే వారి ప్రతినిధులను తీసుకొని పలు రాష్ట్రాలకు అధ్యయనం కోసం తీసుకొని వెళ్తామని మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మొన్న జరిగిన జూమ్ సమావేశంలో వివరించారు. కాబట్టి జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు అందరు కూడా మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ భారతి హోలికేరి సూచనలకు అనుగుణంగా విధుల్లో చేరాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా మినీ అంగన్వాడీ టీచర్ల యూనియన్ నుంచి వారు సమ్మెలో పాల్గొనడం లేదని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మన జిల్లా నుంచి కూడా మినీ అంగన్వాడీల టీచర్ల సంఘం సమ్మెలో పాల్గొనడం లేదని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం వారితో మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలకు గా మార్చిన విషయాలను వివరించారు. దానితో వారు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందారు.అలాగే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒకవేళ ఎక్కడైనా అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిందిగా సూచించి ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగా పంచాయతీ కార్యదర్శులు, రిసోర్స్ పర్సన్స్ లు మెప్మా ఉపాధి హామీ పథకం మధ్యాహ్న భోజనం పథకం విభాగాలు, ఎన్ సిసి ,ఎన్ ఎస్ ఎస్ , ఎన్ జి ఒ , యువజన సంఘాలు, తల్లుల కమిటీలు, వివోలు, మహిళా స్వశక్తి గ్రూపులు తో చర్చించి సమ్మెకు వెళ్లే వారి స్థానాలలో వారి సేవలు వినియోగించుకోవడానికి నిన్న జరిగిన జూమ్ మీటింగ్ లో అనుమతులు మంజూరు చేశారు…
[zombify_post]

