in ,

సిపిఎం ప్రజా రక్షణ భేరి కరపత్రాలు విడుదల.

*సిపిఎం ప్రజా రక్షణ భేరి కరపత్రాలు విడుదల*

*అక్టోబర్ 30న కోడుమూరులో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి*

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పాలకులకు, ప్రతిపక్షాలకు రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు పూర్తయినా రాష్ట్ర అభివృద్ధి మాత్రం పట్టడం లేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యం డి ఆనంద్ బాబు విమర్శించారు.

శుక్రవారం గోనెగండ్ల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనందబాబు మండల నాయకులు దండు కాజా, బి కరుణాకర్ లతో కలిసి సిపిఎం ప్రజా రక్షణ భేరి కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి పాలనలో దేశం మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని, ప్రపంచంలోనే ఆకలి ఎక్కువ ఉన్న దేశాలలో భారతదేశం చేరింది అని అంటేనే పాలకుల తీరు అర్థమవుతోందన్నారు. ప్రజల ఆహార భద్రతకే ముప్పు తీసుకుని వచ్చే నల్ల చట్టాలను తీసుకువచ్చిన బిజెపిపై దేశ రైతాంగం కనివిని రీతిలో సాగించిన ఢిల్లీ పోరాటం ద్వారా వెనక్కు కొట్టినా.. నాడు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ, ప్రభుత్వ రంగాన్ని తెగ నమ్ముతూ, ప్రజల ఆస్తుల్ని అంబానీ ఆదానీలకు దోచి పెడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్టని కేంద్ర ప్రభుత్వం పైన 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీకి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపికి మాట్లాడే దమ్ము లేదన్నారు. సామాన్యుల పైన, రైతుల పైన, కార్మికుల పైన వేసే బారాలను వ్యతిరేకించడానికి బదులు, ఇక్కడ కొట్లాడుకుంటున్న ఈ రెండు పార్టీలు కేంద్రంలో సాగిలపడి బిజెపికి సహకరిస్తున్నాయన్నారు. ప్రశ్నించే పేరుతో ముందుకు వచ్చిన జనసేన కేంద్రం రాష్ట్రానికి ఏం సహాయం చేసిందని ప్రశ్నించడం లేదో  అర్థం కావడం లేదన్నారు. ప్రజల సంక్షేమం పట్టని ఈ పాలక వర్గాల తీరుకు వ్యతిరేకంగా ప్రజా రక్షణ యాత్రను సిపిఎం చేపట్టిందన్నారు. సిపిఎం ప్రజా రక్షణ రాష్ట్ర బస్సు యాత్ర ఈనెల 30న ఆదోని నుండి బయలుదేరి ఆలూరు, ఆస్పరి, పత్తికొండ, దేవనకొండ మీదుగా కోడుమూరు కర్నూలు దాకా జిల్లా లో కొనసాగుతుందని, కోడుమూరులో సాయంకాలం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభకు గోనెగండ్ల మండలం నుండి అత్యధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

అవ్వా తాతలు ఆప్యాయంగా పలకరిస్తూ….

కాల్ డేటా అంశంపై 31న తీర్పు