in ,

పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి…..ఎస్టియూ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్లకు చెల్లించవలసిన ఆర్థికపరమైన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అదనపు కార్యదర్శి శ్రీ సి.నాగరాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ టి.కే. జనార్ధన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

2023 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ కార్మికుల చెల్లించవలసిన అన్ని రకాల ఆర్థికపరమైన పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని ఉద్యోగుల *”జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్* ” నందు ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంతవరకు పెండింగులో ఉన్న ఆర్థిక బకాయిలను చెల్లించకపోవడం శోచనీయమని అన్నారు.

శనివారం(07.10.23) ఆదోని రాష్ట్రోపాధ్యాయ సంఘ భవన్ నందు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం నందు మాట్లాడుతూ……..1). 2021 సెప్టెంబర్ నెల నుండి దాదాపుగా 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సంపాదిత సెలవుల నగదీకరణ మొత్తాలను వెంటనే చెల్లించాలి.

2.) 2023 మే నెల నుండి 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న భవిష్య నిధి రుణాలు మరియు   క్లోజర్ మొత్తాలను చెల్లించాలి

3).దాదాపు గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్న జీవిత బీమా (ఏపీజీఎల్ ఐ) రుణం మరియు క్లోజర్ మొత్తాలు

4). పెండింగ్ లో ఉన్న 11వ పిఆర్సి ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి

5). 2022 జులై నుండి చెల్లించవలసిన పెండింగులో  ఉన్న 3 విడతల కరువు భత్యం చెల్లించాలి

6). సమగ్ర శిక్ష లో భాగంగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న పిజిటి, సీఆర్టీ మరియు ఇతర సిబ్బందికి పెండింగ్ లో ఉన్న 3 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని

7) మండల విద్యాధికారుల పరిధిలో పనిచేస్తున్న సి ఆర్ పి లు , ఎం ఐ ఎస్, డిటిపి ఆపరేటర్లు మరియు అకౌంటెంట్, అటెండర్ గత రెండు నెలలుగా పెండింగులో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తన పరిధిలో పనిచేస్తున్న 13 లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్లకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం శోచనీయమని  ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటైన అవమానకరమైన అంశమని తెలిపారు. సకాలంలో జీతాలు మరియు ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకుండా తన పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్లను ఆర్థికంగా ఇబ్బంది పెడుతుందని, తత్ఫలితంగా రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్ కార్మికులు మానసిక వేదనకు గురవుతున్నారని ఇది సరైన చర్య కాదని కావున ప్రభుత్వం వెంటనే స్పందించి తన పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ కార్మికులకు  ప్రతినెల ఒకటవ తేదీనే జీతాలు మరియు సకాలంలో ఆర్థిక బకాయిలు చెల్లించే  విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వీరచంద్ర యాదవ్, లోక్య నాయక్, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

దీక్షల జోరు.. పోరు హోరు…

తొలి తిరుపతి కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాదయాత్ర