ఆదోని అభివృద్ధి చెందాలంటే వైసీపీని రాబోయే ఎన్నికల్లో తరిమేద్దాం అని ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప పాల్గొన్నారు. మల్లప్ప మాట్లాడుతూ.. 30 సంవత్సరాల క్రితం ఆదోని ఎలా ఉందో అలాంటి ఆదోనిని మళ్లీ సెకండ్ బాంబేగా పిలిచేలా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మహేష్ యాదవ్ చౌడప్ప గారి పులి రాజు, జనసైనికులు గోపాల్, గోవిందు, జెసిబి వీరేష్ , బుగ్గప్ప, మౌనేష్ భాష, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
in Karnool, Latest News