in

కనిపించని నాలుగో సింహం ఎస్ఐ శ్రీను నాయక్

డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 

కొత్తపేట నియోజకవర్గం స్పెషల్ స్టోరీ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎల్.శ్రీను నాయక్ 1985 ఆగష్టు 6న జన్మించారు.శ్రీను నాయక్ కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో బిఏ డిగ్రీ పూర్తి చేశారు. పాలీస్ అవ్వాలన్న బలమైన సంకల్పంతో పట్టుదలతో 2012లో ఎస్ఐ గా శ్రీను నాయక్ సెలెక్ట్ అయ్యారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి ప్రస్తుతం మండపేట రూరల్ లో తొలిసారి ఎస్ఐ శ్రీను నాయక్ బాధ్యతలు స్వీకరించారు.అనంతరం రామచంద్రాపురం, సామర్లకోట, అనపర్తి, రాయవరం, కొత్తపేట,అల్లవరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ప్రస్తుతం ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు.మొదటి పోస్టింగ్ లోనే ఎస్ఐ శ్రీను నాయక్ తన ప్రతిభతో ఒక కేసు విషయంపై నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోకి, షావుకారుగా మారు వేషంలో వెళ్లి నక్సలైట్ల దగ్గర నుంచి తుపాకీ లను, బుల్లెట్ల ను స్వాధీనం చేసుకుని తన ధీరత్వాన్ని వీరత్వాన్ని చాటారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా పనిచేస్తున్న సమయంలో ఒక కేసు విషయంలో ముద్దాయిని 3 రోజుల్లోనే పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టిన ఘనుడు నాయక్. అలాగే మారు వేషాల్లో వచ్చి కిడ్నాప్ చేస్తున్న వ్యక్తులను తెలివిగా చాకచక్యంగా అరెస్ట్ చేశారు.సామర్లకోటలో ఎస్ఐ గా పనిచేస్తున్న సమయంలో జగ్గంపేట పరిధిలోని కాట్రేవుపల్లి గ్రామంలో రెండు కులాల మధ్య గొడవలు జరగగా సామర్లకోటలో నమోదు అయితే చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరువర్గాలకు చెందిన కేసులను శాంతిభద్రతలను కాపాడుతూ ఉన్నతాధికారులకు కేసు యొక్క పూర్వాపరాలను తెలియచేస్తూ తన భుజ్కంధాలపై వేసుకుని క్షునంగా పరిశీలించి ఇరువర్గాలను గొడవను శాంతియుతంగా పరిష్కరించారు. దొంగతనాలు దోపిడీలు పూర్తిగా అరికట్టి చిన్నచిన్న దొంగతనాలను కూడా రోజులు వ్యవధిలోనే పట్టుకునేవారు.గంజాయి, దొంగనోట్ల, జూదాలు పై ఉక్కుపాదాన్ని మోపారు.రోడ్లపై ఒంటరి గా ఉన్న వారిని బ్లేడ్లతో పీకలు కోసే ఒడిస్సా ముఠాను ప్రాణాలకు తెగించి మరీ పట్టుకున్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత, రాజకీయ, కుల నాయకుల విగ్రహాలపై దాడులు జరిగితే శాంతిభద్రతల కు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున అనపర్తి గ్రామంలో ముఖ్య కూడలిలో ఉన్న విగ్రహాలకు సంబంధించి గ్రామస్తులు, కుల, రాజకీయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి విగ్రహాలకు ఎటువంటి హాని కలుగకుండా అనపర్తిలో నిత్యం శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. రాయవరం ఎస్సైగా పనిచేసే రోజుల్లో రాయవరం ఠాణ ను సిదిలమైపోతున్న వాటిని తీసివేసి కొత్తగా చేయించి అప్పటి ఎస్పీ చే ఆవిష్కరించారు. రాయవరం లో రైతులను మోసం చేసి డబ్బు కాజేసిన వ్యక్తులను అతి తక్కువ సమయం లో చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి నగదు స్వాధీన పరుచుకుని రైతులకు న్యాయం చెయ్యడంలో శ్రీను నాయక్ విజయం సాధించారు. ఈ విషయంలో ఎస్పై శ్రీను నాయక్ కు రాయవరం గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కరోనా సమయంలో ఒక నివాసం వద్ద ఒక వ్యక్తి మృతి చెందగా ఇంటిలో ఉన్న వ్యక్తులే మృతి చెందిన వ్యక్తిని దహన సంస్కరాలు చేయక పోవడంతో ఆయన, మరియు కొందరు విలేకరులు, ప్రజలను తీసుకుని ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవ త్వం చాటుకున్నారనీ ఇప్పటికీ అక్కడి ప్రజలు చెప్పుకోవడం విశేషం. ఇది జరిగిన సమయంలోనే కరొనను తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో నిరంతరం శ్రమిస్తూన్న నాయక్ మరియు వారి భార్యతో కరోనా బారినపడి కోలుకుని మరల విధుల్లో చేరారు. బదిలీలో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా వచ్చిన నాయక్ కు అవార్డ్ లు రివార్డు అందుకోవాల్సిన కేసులో సస్పెండ్ కి గురయ్యారు. స్టేషన్లో మూలన పడిపోయిన ఒక మిస్సింగ్ కేసును ఛేదించే విషయంలో కోర్టు ఆదేశాలపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్సై శ్రీను నాయక్ ను విధుల నుంచి తొలగించి సస్పెండ్ చేశారు.ఆ సమయంలో నాయక్ ను సస్పెండ్ చేయడంతో కొత్తపేట ప్రజానీకం అందరూ కలిసకట్టుగా కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా ఎస్సై శ్రీను నాయక్ అండగా నిలిచి కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమా లు చేపట్టి ఎస్సై సస్పెండ్ ఎత్తివేయాలని నిరసనలు తెలిపారు అంటే ప్రజలతో ఎంత మమేకం అయ్యారో ప్రజల హృదయాలలో ఆయన స్థానం ఏంటో అర్థమవుతుంది.పాలీస్ సెలక్షన్లో ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యి ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన పోలీస్ శాఖకు ఉన్నతమైన పేరు తీసుకొస్తూ ఉన్నతాధికారులచే శభాష్ అనిపించుకునే విధంగా ఎస్ఐ శ్రీను నాయక్ విధులు నిర్వహిస్తున్నారు.వివిధ పోలీస్ స్టేషన్ల లో అయన ఛేదించిన కేసులు అమోఘం ఆచ్చార్యం.ఒంటి చెప్పుతో ముద్దాయి నీ కనుగొన్న ధీరుడు మూలాన పడిపోయిన కేసులను ఎవరు కనిపెట్టలేరు అనుకునే కేసులను తనదైన శైలిలో చేదించిన ఘనత ఎస్ఐ శ్రీను నాయక్ కే సొంతం.తను విధులు నిర్వర్తించిన స్టేషన్ లలో దాదాపు అన్ని స్టేషన్ లలో కూడా అచ్చార్య పరిచే కేసులను చేదించారు.ప్రజల ఆదరణ ఆప్యాయత అనురాగం ప్రేమ పొందారు.కనిపించని నాలుగో సింహం ఈ ఎస్ ఐ శ్రీను నాయక్ అని ప్రజల హృదయాలలో నాటుకుపోయింది. హెట్సప్ పోలీస్ నాయక్ సాబ్

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

ప్రధాన రహదారిపై ఒంటరి ఏనుగు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రతిపక్షాల దుష్ప్రచారం – కొటగుళ్లి భాగ్యలక్ష్మి