in , , ,

రామతీర్థం శోభాయమానం”

రెండో భద్రాద్రిగా రామతీర్థం విరాజిల్లుతోంది. ఎంతో చారిత్రక విశిష్ఠత కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో నీలాచలం కొండపై కోదండరాముడు వెలిసి ఉండగా.. దిగువన ప్రధాన ఆలయంలో శ్రీరామచంద్ర ప్రభువు కొలువై ఉన్నాడు. ఏటా మహాశివరాత్రి, శ్రీరామనవమి, వార్షిక కల్యాణం, బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు దేవదాయశాఖ శ్రీకారం చుట్టింది.రెండో భద్రాద్రిగా రామతీర్థం విరాజిల్లుతోంది. ఎంతో చారిత్రక విశిష్టత కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో నీలాచలం కొండపై కోదండరాముడు వెలిసి ఉండగా.. దిగువన ప్రధాన ఆలయంలో శ్రీరామచంద్ర ప్రభువు కొలువై ఉన్నాడు. ఏటా మహాశివరాత్రి, శ్రీరామనవమి, వార్షిక కల్యాణం బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు దేవదాయశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకంలో రూ. 70 లక్షలతో దేవస్థానానికి ఆనుకుని ఉన్న భాస్కర పుష్కరిణి ఆధునికీకరణ చేపట్టారు. 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న పుష్కరిణిలో తామర, తూటికాడ దట్టంగా పెరగడంతో నీరు కలుషితమై అధ్వానంగా ఉండేది. ప్రస్తుతం నీటిని పక్కనున్న చెరువుకు మళ్లించి యంత్రాల సాయంతో పూడికను తొలగించారు. భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా అవసరమైన వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

రెండో విడతలో రామతీర్థం రామాలయానికి మంజూరైన నిధులతో పుష్కరిణి చుట్టూ సుందరీకరణ చేపట్టేందుకు దేవదాయ శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వివిధ రకాల పుష్ప, పండ్ల జాతుల మొక్కలను నాటి పెంచి పచ్చదనం పెంపొందించనున్నారు. కోనేరు చుట్టూ మట్టికట్టకు

రాతిపేర్పు, ల్యాండ్ స్కేపింగ్, విద్యుద్దీపాలతో పాటు భక్తులు కూర్చునేందుకు సిమెంట్ బెంచీలు వంటివి ఏర్పాటుకు ప్రతిపాదించారు.  అమృతో సుందరీకరణ

మొదటి విడతలో పుష్కరిణికి ఉత్తరం వైపు ఉన్న రెండు స్నానాల ఘాట్లు, మెట్ల మరమ్మతులు చేపట్టారు. తూర్పు వైపు కొత్తగా ఘాట్ ఏర్పాటు చేశారు. నీరు వచ్చే | మదుమును బాగు చేయడంతో పాటు పడమర వైపు కొత్తగా మళ్లింపు మదుము నిర్మించారు. పుష్కరిణి మధ్యలో ఉన్న ఆలయానికి విద్యుద్దీకరణ, నిర్వహణ పనులు చేపట్టారు. భక్తుల రక్షణ కోసం స్నానాల ఘాట్ల వద్ద ఇనుప గొట్టాలతో రెయిలింగ్ ఏర్పాటు చేశారు.

భక్తులకు మరిన్ని సౌకర్యాలు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Prasad

గడప గడపకూ విద్యుత్తు షాక్”

చంద్రబాబుకు మద్దతుగా లాయర్లు దీక్ష.