మెలియాపుట్టి మండలం జూడూరు పంచాయతీ, అచ్చినాపురం గ్రామంలో ఆదివాసి గిరిజన చైతన్య వేదిక మరియు ఆదివాసి సేన, ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేగులపాడు ఆఫ్సోర్ రిజర్వాయర్ కు కనెక్టివిటీకే ఉన్న మహేంద్ర తనయ కెనాల్ నిర్వాసితులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అచ్చినాపురం ఆదివాసి గిరిజనులకు ఈ ప్రభుత్వం, ఈ అధికారులు అన్యాయం చేశారు. అయితే ఈ సమస్య ఈ గ్రామంలో ఉన్న వాలంటీర్ మరియు మా ఆదివాసి గిరిజన చైతన్య నివేదిక సభ్యుడు జర్నీ కూర్మారావు ఈ సమస్యను మా యూనియన్ వద్దకు ప్రస్తావించగా దీనిపై క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టులో ఫీల్ వేయడం జరిగింది, అయితే గౌరవ న్యాయస్థానం వారు ఈ నిర్వాసితులకు చట్టపరంగా అన్ని అర్హతలను చూసుకొని వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వవలసిందిగా గౌరవ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది , దీనికిగాను గ్రామంలో ఉండే ఆదివాసులు మాకు ధన్యవాదములు తెలుపుతూ, ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం అసెంబ్లీలో రెండవసారి కూడా బోయ, వాల్మీలకు ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు తీర్మానం ప్రవేశించడం ప్రవేశించి పెట్టడం చాలా దుర్మార్గం చాలా అన్యాయం వీటన్నిటిపై చర్చించడం జరిగినది.