in , , ,

చంద్రబాబు కేసు.. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌

ఢిల్లీ: ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే..

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం..

► సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

► చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి

► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి

► విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు

► నిధులను షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్‌ చేసుకున్నారు

► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి

► ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ

► ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం: ఏపీ ప్రభుత్వం.

ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫు లాయర్‌ సిద్దార్థ లూథ్రా క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీజే.. చంద్రబాబు పిటిషన్‌పై మంగళవారం ఏదో ఒక బెంచ్‌ విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. దీంతో, పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది..

Written by Allagadda CM news

ముగిసిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర

సామాన్యుడి సొంతింటి కల మరింత భారం.