టిడిపి అధినేత చంద్రబాబు పైన పెట్టిన తప్పుడు కేసులకు భయపడేదే లేదని, ప్రజాగ్రహాన్ని రుచి చూపిద్దామని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు..మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, చంద్రబాబుకి సంఘీభావంగా వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. బాబుకి మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం వచ్చిందని అన్నారు. సెప్టెంబర్ 30వ తేదీన సరిగ్గా 7 గంటలకు తెలుగు ప్రజలంతా మోత మోగించాలన్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే 5 నిమిషాల పాటు శబ్ధం చేయాలన్నారు టీడీపీ నేత నారా లోకేష్. శబ్ధం చేసేందుకు గంట, పళ్లాలు, విజిల్స్, హార్న్ లాంటివి వాడాలని.. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్యాలన్నారు.