in , , ,

అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ;

  • 62 వార్డు ప్రకాష్ నగర్ లో శ్రీ అభయ వినాయక ఆలయం వి ఎస్ టీం ఆధ్వర్యంలో, సచివాలయ కన్వీనర్ రావాడ అప్పారావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.

ముందుగా శ్రీ అభయ వినాయక ఆలయంతో పాటు వి ఎస్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాన్ని, కాలనీలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను కూడా సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారికి ఘన స్వాగతం పలికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానాల్లో అన్నదానం గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు సూచించారు. శ్రీ గణనాధుని దీవెనలు అందరి పైన ఉండాలని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు గారు, 61వ వార్డ్ కార్పొరేటర్ కొణతాల సుధా గారు, యూత్ లీడర్ అనుదీప్ గారు, బోగవల్లి నాగభూషణం గారు ఆడారి నాగరాజు గారు, రావాడ అప్పారావు గారు, GVSN రాజు ( కేబుల్ వాసు) గారు, సోషల్ మీడియా స్పందన బాబురావు, పీల అనంతగారు, భేసేట్టి వెంకట అప్పారావు, ఏ. రంజిత్ కుమార్ గారు ,నాగేంద్ర గారు, కామేశ్వరరావు గారు, వార్డ్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMSMEDC) మరియు సమన్వయకర్త, విశాఖ పశ్చిమ 

Written by Prasad

‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది.

వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు