కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన బాధితులకు అండగా నిలిచిన శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు.
సొంత ఖర్చులతో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు. జీవీఎంసీ పరిధి 58వ వార్డు ములగాడ ప్రాంతానికి చెందిన సుమారు 14 మంది గాజువాక లోని ఒక రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని అస్వస్థత కు గురయ్యారు. ఈ మేరకు బుధవారం శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు ములగాడ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు..శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, శానిటేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురిని కేజీహెచ్ కు తరలించేందుకు అధికారులు సూచించగా బాధిత కుటుంబ సభ్యులు అంగీకరించని నేపథ్యంలో శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు చొరవ తీసుకొని తన సొంత నిధులతో కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ లో వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇన్చార్జిలు, అభిమానులు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!