రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన ఆదోని తిమ్మారెడ్డి బస్టాండ్ వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదోని న్యూ గాంధీనగర్ కు చెందిన గోపాల్, బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.