ఆదోని పట్టణంలోని YMK స్కూల్ సమీపంలోని కొత్త బ్రిడ్జి వద్ద రైల్వే పట్టాలపై నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. ఆదోని రైల్వే ఎస్సై రామస్వామి శనివారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు..మృతుడు తెల్ల షర్టు, నీలపు రంగు ప్యాంటు ధరించాడన్నారు, పక్కన నల్ల రబ్బర్ చెప్పులు వదిలి రైలు కింద పడి మృతి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు సంప్రదించాలన్నారు..
in Karnool, Latest News