తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ముగిసింది. గురువారం సాయంత్రం విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)తో కలిసి బయల్దేరిన ఆయన రాత్రికి విజయవాడ చేరుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు లోకేష్ కు స్వాగతం పలికారు. కాగా శుక్రవారం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు లో చంద్రబాబు తో ములాఖాత్ కానున్నారు.