in ,

మాత్స్యకారుల చిరకాల కల నెరవేరుతుంది వైసీపీ ఎమ్మెల్యే అవంతి

గురు న్యూస్ విశాఖపట్నం :భీమిలి నియోజకవర్గం లో గల మత్స్య కారులు వ్యాపార సౌకర్యార్థం మాకు ఫి‌ష్ ల్యాండింగ్ జట్టి నిర్మాణం చేపట్టాలని గతంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ని కోరడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడంతో దానికి సానుకూలంగా స్పందించిన సీఎం గత రెండు నెలలు క్రిందట జెట్టి నిర్మాణం కై నిదులు మంజారు చేయగా ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ సిబ్బంది మరియు ఫిషింగ్ శాఖ సిబ్బంది తో నిర్మాణం కై స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్బంగా అవంతి గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలు తో పాటు మత్స్య కారులు కు అన్ని విధాలా పెద్ద పీట వేసారని,ఈరోజు ఈ ఫిష్   లాండింగ్  నిర్మాణం వలన చుట్టుపక్కల మత్స్య కారులు అందరికి తుఫాన్ లు సంభవించే సమయంలో పడవలు వేట బోట్లు కట్టుకోవడానికి అలాగే చేపలు అమ్మకాలు లావాదేవీలు చేసుకోవడానికి సరైన మార్గం లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అని మాట్లాడారు. అనంతరం ఈ జట్టి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కు అవంతి గారు ఆదేశాలు జారీ చేశారు. అవంతి గారి చొరవతో పిష్ ల్యాండింగ్ జెట్టి నిర్మాణం కి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం గా ఉందని స్థానికులు సంతోషం తో అవంతి కి దన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు – స్థానిక వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.

Written by Balakishan

తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన

ప్రమాదాల నివారణ కొరకు పటిష్టమైన చర్యలు : కలెక్టర్ హిమాన్షు శుక్ల