*
తిరుపతి :సెప్టెంబర్ 29
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. స్వామివారి ప్రధాన ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు సమర్పించిన కానుకలను నేడు టెండర్ కమ్ వేలం వేయనున్నారు.
కొత్త వాటితో పాటు పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 14 లాట్ల వరకు ఉన్నాయి. వీటిల్లో ధోతీలు, ఆర్ట్ సిల్క్ చీరలు, నైలాన్, నైలెక్స్ చీరలు, లుంగీలు, క్లాత్ బిట్స్, ఆర్డినరీ టవల్స్.. వగైరా వగైరా ఉన్నాయి.
వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని, 0877-2264429 ఫోన్ నెంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in ద్వారా సంప్రదించవచ్చు.