*
వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం డబ్బుల విడుదల తేదీ ఖరారైంది. శుక్రవారం విజయవాడలో సీఎం జగన్ ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10వేలు జమ చేయనున్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం.. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడిపే వాహనదారుల అకౌంట్లో బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తారు. ఒక కుటుంబంలో ఒక వాహనానికి మాత్రమే అమౌంట్ జమ చేస్తారు.