in ,

ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా వెంటనే స్వాధీనం చేసుకొవా

గౌరవనీయులైన గుంతకల్ రెవిన్యూ డివిజన్ అధికారి (RDO) గారికి ,

సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ సమర్పించు మెమోరాండం ,

విషయం ,, ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా స్వాధీనం చేసుకొనుట కొరకు .

పట్టణంలో బళ్లారి సర్కిల్ , హెచ్ పి పెట్రోల్ బంక్ ప్రక్కన గుంతకల్ గ్రామ పొలం సర్వే నంబర్ 424 –బి లోని 23 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని పెట్రోల్ బంక్ యజమాని దేవేంద్రప్ప ఆక్రమించి 16 షెడ్లను అక్రమంగా నిర్మించుచున్నారు .

కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురికాకుండా వెంటనే స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలి, గతంలో కూడా  పై సర్వే నంబర్ స్థలాన్ని ఆర్ టి ఓ  కార్యాలయానికి కేటాయించడం జరిగినది. విస్తీర్ణం తక్కువగా ఉన్నదని అక్కడ ఆర్ టి ఓ కార్యాలయాన్ని నిర్మించడానికి వీలు కాదని అధికారులు అప్పట్లో భవనాన్ని నిర్మించలేదు . దీనినే అదునుగా తీసుకొని ప్రైవేటు వ్యక్తులు విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుచున్నారు . ఇంత జరుగుతున్న రెవెన్యూ ,  మున్సిపల్  , ఆర్ అండ్ బి అధికారులు స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపుతూ కబ్జా చేస్తున్న వ్యక్తులకు తమ సహకారాన్ని అందించడం జరుగుతున్నది .

కావున దయచేసి ఈ  విషయం మీద తమరు వెంటనే స్పందించి పై సర్వేనెంబర్ సంబంధించిన స్థలాం పై విచారణ జరిపి ,  ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము . లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ప్రభుత్వానికి తెలుపుతున్నాము .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్ డివిజన్ కార్యదర్శి బి , సురేష్ ,  పట్టణ కార్యదర్శి చిన్నా , ఐ ఎఫ్ టి యు పట్టణ అధ్యక్షులు రామాంజనేయులు ,  కమిటీ సభ్యులు భాష ,  నారాయణ , జానయ్య , గోపి , కృష్ణ  రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

                     

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

ప్రజా ప్రతినిధులపై సీరియస్ అయిన ఎంపీపీ మణికుమారి

ఉప్పాడ సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ డాల్ఫిన్.