భద్రాచలం నియోజకవర్గంలో గల ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను భద్రాచలం ఆర్డీఓ మంగీలాల్ ఆదివారం తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రాబోయే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ లలో సౌకర్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ రాహుల్ చంద్ర వర్మ, ఆర్ఎస్ఐ కీసరి రాజు, జూనియర్ అసిస్టెంట్ కిరణ్, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
in Khammam, Latest News, Telangana