చర్ల పోలీసులు అరెస్టు చేసిన కామ్రేడ్ కొండా చరణ్ ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సీపీఐ ఎం ఎల్ ప్రజాపంద పార్టీ కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఆదివాసులు సమస్య లపై నేడు భద్రాచలంలో ప్రజాపందా ప్రదర్శన నిర్వహించ తలపెట్టిందని వారినీ పౌరులు గా గుర్తించాలని, వారికి పోడు హక్కుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని. ఈ డిమాండ్స్ మీద ప్రచురించిన కరపత్రాలను పంచుతూ తిరిగి వస్తుండగ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కొండా చరణ్ ను చర్ల మండలం పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. పోలీసులు కవాలని బాంబులు,ఏదో వస్తువులు తెచ్చిపెట్టి మావోయిస్ట్ అని అబద్దపు కేసు నమోదు చేసి జైల్ కు పంపించారు. పోలీస్ ల ఈ కేసు ను, అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు.
in Khammam, Latest News, Main News, Telangana