in , ,

కొండా చరణ్ ను తక్షణమే విడుదల చెయ్యాలి

నిత్య ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, ప్రజా సమస్యలే పరిష్కారంగా పనిచేస్తున్న సిపిఐ(ఎంఎల్) ప్రజా పంథా పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ ను తక్షణమే విడుదల చెయ్యాలని ఆ పార్టీ డివిజన్ నాయకులు మునిగల శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు.ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే వ్యక్తిపై మావోయిస్టు కొరియర్ గా ముద్రవేసి అరెస్టు చెయ్యడాన్ని తప్పుబట్టారు.వలస ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చెయ్యడమే తప్పా అంటూ విమర్శించారు.ముంపు బాధితులకు ఇంటి స్థలాలకోసం పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు చరణ్ పై కక్ష పెంచుకున్నారని, ఆనాడు బెదిరింపులు సైతం చేశారని అన్నారు.ఆ కక్ష సాధింపే ఈ అరెస్టు అని పేర్కొన్నారు.డివిజన్ నాయకులకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.వెంటనే విడుదల చెయ్యాలని లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

మరికొద్ది సేపట్లో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లనున్న భువనేశ్వరి

నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో చేపట్టేలా చర్యలు