in , , ,

రాజోలు మండలం తాటిపాక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం మన రాపాక

 రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు జనం మెచ్చిన పాలన అందిస్తున్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గారు అన్నారు. రాజోలు మండలం తాటిపాకలో ఆదివారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరించారు. అనంతరం స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Written by Aruntez

ఫోన్‌ పోయిందని యువకుడు సుసైడ్‌

రాజోలు లో టిడిపి చేస్తున్న దీక్షకు జనసేన మద్దతు