ఆదోనిలోని పంజరాపోల్ ,ఆర్ ఆర్ లేబర్ కాలనీ రోడ్డు క్రాస్ వద్ద ప్రమాదకరంగా ఉన్న కాలువకు నివారణ చర్యలు చేపట్టాలని శుక్రవారం స్థానికులు అధికారులను కోరారు. కాలువపై రోడ్డు నిర్మించి ఇరువైపులా సేఫ్టీ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. స్కూలు, లేబర్ కాలనీ విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారన్నారు. ఏటవాలుగా ఉండటంతో బైకు, సైకిళ్లు అదుపుతప్పి కాలువలో పడిపోయే ప్రమాదముందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోగలరని స్థానిక ప్రజలు తెలియజేశారు.
in Karnool, Latest News