వినాయక నిమజ్జనం సందర్భంగా శుక్రవారం ఆదోనిలోని మద్యం షాపులు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సూచించారు. ఎక్కడైనా మద్యం షాపులు తెరచినా, మద్యం అమ్మకాలు సాగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.