in ,

ఎల్లారెడ్డి పేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి*

*ఎల్లారెడ్డి పేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి*

*ఎర్రగడ్డ తండా ప్రజల ఏకగ్రీవ తీర్మానం*

*దాసంజనేయ స్వామి దేవాలయములో పూజలు*

*అనంతరం ప్రచారం ప్రారంబించిన రెవెన్యూ డివిజన్ సాధన సమితి.*

దర్యాప్తు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 18:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావు పేట ముస్తాబాద్ నాలుగు మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ వీర్నపల్లి మండలంలోని ఎర్రగడ్డ తండా ప్రజలు తీర్మానం కాపీని రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ కు అందజేశారు. బాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి పర్వదినం సందర్భంగా వీర్నపల్లి లోని దాసాంజనేయ స్వామి ఆలయం లో  ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి రెండు మండలాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు సామూహికంగా పూజలు నిర్వహించారు. గ్రామగ్రామాన రెవెన్యూ డివిజన్ సాధన వల్ల జరిగే లాభాలను ఎర్రగడ్డ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ నేటి నుండి నాలుగు మండలాలలో ప్రతి గ్రామగ్రామాన రెవెన్యూ డివిజన్ విశిష్టత ను ప్రజలందరికీ వివరిస్తామని బాలరాజు యాదవ్ వివరించారు.రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట మాందాటి లక్ష్మణ్ యాదవ్, వీర్నపల్లి రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ పీరు నాయక్, పరుమాల మల్లేష్ యాదవ్,జోగుల కాంతయ్య, రాకేష్,శ్రీనివాస్ లతో పాటు ఎర్రగడ్డ తండా ప్రజలు పాల్గొన్నారు.*ఎల్లారెడ్డి పేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి*

*ఎర్రగడ్డ తండా ప్రజల ఏకగ్రీవ తీర్మానం*

*దాసంజనేయ స్వామి దేవాలయములో పూజలు*

*అనంతరం ప్రచారం ప్రారంబించిన రెవెన్యూ డివిజన్ సాధన సమితి.*

 

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి

దహన సంస్కారాలకు 16 వేలు అందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్