in ,

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై డి.సుధాకర్*

 మద్యం సేవించి వాహనాలు నడిపితె కఠిన చర్యలు  తప్పవని ఇల్లంతకుంట ఎస్ఐ డి.సుధాకర్ హెచ్చరించారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చోటే నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని తద్వారా సమాజానికి కీడు జరుగుతుందని  అన్నారు. శనివారం రోజున సిరిసిల్ల రోడ్డులో రహింఖాన్ పేట వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడిపిన  కరీంనగర్ కు చెందిన మాడే.శ్రీనివాస్ , చౌడరం గ్రామానికి చెందిన చెంజర్ల మల్లేశం లపై కేసు నమోదు చేయడం జరిగిందని, అలాగే రోడ్లపై సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన మరియు  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 29  వాహనాల పైన రూ(6650/-) జరిమానా విధించడం జరిగిందని  అన్నారు.
ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహనాల తనిఖీలలో ఏఎస్సై మోతిరాం, కానిస్టేబుల్ లు తిరుపతి, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

బోయినపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకుఅల్పాహారం ప్రారంభం

ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేయాలి*