in ,

బోయినపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకుఅల్పాహారం ప్రారంభం

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులకు ఉదయము పూట అల్పాహారమును  లాంచనముగా ప్రారంభం చేస్తున్నట్లు బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం లోని ఉన్నత పాటశాల లో ఎంపిపి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపిపి వేణుగోపాల్   మాట్లాడుతూ ఇట్టి అవకాశం సద్వినియోగం చేసుకొని చదువులలో ఉన్నత శిఖరాలు చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెస్  డైరెక్టర్ సుధాకర్, ఏఎంసి వైస్ చైర్మన్ చిక్కాల  సుధాకర్  రావు ,బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య,దేశాయిపల్లి సర్పంచ్ గోపాల్ రెడ్డి,బి బి ఆర్ ఎస్ నాయకులు  గుంటి శంకర్ మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షిత్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రేమ లత ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లోకి…

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై డి.సుధాకర్*