in

ఇంజ‌నీర్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన జిల్లా క‌లెక్ట‌ర్‌, జెసి. ఐటిడి ఏ పిఓ

పాడేరు, అల్లూరి జిల్లా: భార‌త‌దేశంలో ఇంజనీర్ల దినోత్సవము సెప్టెంబరు 15న జరుపుకుంటారు. సుప్రసిద్ధ ఇంజనీర్ మోక్ష‌గుండం  విశ్వేశ్వ‌ర‌య్య  పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవముగా జరుపుతారు. ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు, వంతెనలు కట్టి నీటిపారుదల, త్రాగునీరు పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగానికి అంతర్జాతీయంగా పేరుపొందాడు.  ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఐటిడి ఏ  స‌మావేశ మందిరంలో జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్‌, జెసి  జె. శివ శ్రీ‌నివాసు,  ఐటి డి ఏ  పి ఓ  వి. అభిషేక్   ఇంజ‌నీర్ల‌కు  శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు. ఈ కార్య‌క్ర‌మంలో  గిరిజ‌న సంక్షేమ శాఖ  ఇ ఇలు  డి. వి. ఆర్‌. ఎం.రాజు, కె. వేణుగోపాల్‌, పంచాయ‌తీ రాజ్ ఇ ఇ టి.కొండ‌య్య‌ప‌డాల్‌, పి ఐ యు ఇ ఇ కె.లావ‌ణ్య కుమార్‌, ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ ఇ ఇ  బాల సుంద‌ర బాబు, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విభాగం ఇ ఇ  లీలా క్రిష్ణ‌,ప‌లువురు డి ఇ ఇలు, ఎఇఇలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో ఘనంగా గణపతి పూజ

ఈనెల 17 నుండి ఆయుష్మాన్ భవ పక్షోత్సవాలు”