విశాఖ గీతం వర్సిటీ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. టిడిపి-జనసేన పొత్తును స్వాగతిస్తూ … శుక్రవారం విశాఖలోని గీతం యూనివర్సిటీ వద్ద పోస్టర్లు వెలిశాయి. వీటిని పోలీసులు తొలగించగా, జనసేన నాయకులు అడ్డుచెప్పారు. ఈ క్రమంలో పోలీసులకు, జనసేన నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతల నేపథ్యంలో … యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈక్రమంలో జనసేన నేత పంచకర్ల సందీప్‌ను అడ్డుకున్నారు. విద్యార్థుల ఐడీ కార్డులను చెక్ చేసి లోపలకి పంపుతున్నారు.
[zombify_post]


