in

జోరుగా పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా

ఎన్టీఆర్ జిల్లా -జుజ్జూరు 

అర్ధరాత్రి వేళ రాష్ట్రాలను దాటుతున్న రేషన్ బియ్యం, పట్టించుకోని నాథుడే కరువాయే?

జయంతి కేంద్రంగా అర్ధరాత్రి వేళ రాష్ట్రాలు దాటుతున్న రేషన్ బియ్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బియ్యాన్ని అధికారుల, రాజకీయ నాయకుల అండదండలతో తరలిపోతున్నా వైనం.

ఒక వ్యక్తి జయంతి కేంద్రంగా ఇంత అక్రమ దందా చేస్తుంటే అధికారులకు రాజకీయ నాయకులకు ముడుపు అందుతున్న అని అందుకే మౌనంగా ఉన్నారని, ఇది జగమెరిగిన సత్యం అని అందుకే ఆ వ్యక్తి అంత ధైర్యంగా రేషన్ బియ్యాన్ని రాష్ట్రాలు దాటిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

ఇకనైనా అధికారులు ముడుపులకు ఆశపడక అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటారా?

లేక మా ముడుపులు మాకు అందుతున్నాయి లే మాకు ఎందుకులే అని వదిలేస్తారా?

ఇకనైనా అధికారులు పేదలకు చేరవలసిన ఉచిత బియ్యాన్ని పేదలకు చేర్చి తమ నిజాయితీని నిరూపించుకుని ఆ వ్యక్తిపై   చర్యలు తీసుకుంటారా? 

…మరింత సమాచారంతో మరలా మీ ముందుకు.

[zombify_post]

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

అప్పులు బాధ తాళలేక యువకుడు ఆత్మహత్య

ద్వారకా తిరుమలలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు