in

మంత్రి కొప్పుల ఈశ్వర్- స్నేహలత దంపతుల చిత్రపటాలకు సిరాభిషేకం


ధర్మారం మండల స్మార్ట్ కిడ్స్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు

ధర్మారం సెప్టెంబర్ 13 గురు న్యూస్ : ఎల్. యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా 550 ప్రైవేటు ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ ఇన్సూరెన్స్ కార్డులను ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా  ఉపాధ్యాయులకు అందించారు.ఎల్ ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి సొంత డబ్బులతో హెల్త్ కార్డులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ..కృతజ్ఞతాపూర్వకంగా తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ – స్నేహలత  దంపతులకు క్షీరాభిషేకం చేసిన ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ విద్యాసంస్థల సిబ్బంది.. స్మార్ట్ కిడ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ బుధరపు మహేందరు ఆధ్వర్యంలో కార్యక్రమము నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాసంస్థల చైర్మన్ భూదారపు రమాదేవి, 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by SATTAIAH GUNDETI

నిర్మల్ లో దొంగ ఓట్ల పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు – ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

కృతజ్ఞత సభను విజయవంతం చేయండి