in ,

సునీత విజ్ఞప్తి.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా పడింది..

అనివార్య కారణాల నేపథ్యంలో వాయిదా వేయాలంటూ వివేకా కుమార్తె, పిటిషనర్‌ సునీత నర్రెడ్డి తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది.

అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇస్తూ ఈ ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ కన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కొన్ని అనివార్య కారణాల రీత్యా కేసు విచారణను వాయిదా వేయాలని సునీత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. ఆ తర్వాత నాన్‌ మిస్లేనియస్‌ డే రోజు విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది..

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ లింగపాలెం లో ఆందోళన

పెరుగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలి