in ,

హోంగార్డులను పర్మినెంట్ చేయాలి*

*హోంగార్డులను పర్మినెంట్ చ

– ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి.

 హోంగార్డులను పర్మినెంట్ చేయాలని,  మృతి చెందిన రవీందర్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎల్లారెడ్డిపేట మండలం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  హైదరాబాదులో హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కేసు నమోదు చేయడం జరిగిందనీ,వారిని రిమాండ్ ఇంతవరకు పంపలేదని అన్నారు. అతని కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 18 వేల మంది హోంగార్డులను ఇప్పటివరకు పర్మినెంట్ చేయలేదనీ,  హోంగార్డులను వెంటనే  పర్మినెంట్ చేసి వారి కుటుంబాలను  ఆదుకోవాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి  వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ యువజన మండల అధ్యక్షుడు బానోత్ రాజు నాయక్,పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, బీసీ సెల్ అధ్యక్షుడు అనవేని రవి యాదవ్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి రఫీ, గుండారం గ్రామ ఉపాధ్యక్షులు శ్రీను రాథోడ్,ప్రశాంత్ రాథోడ్, తిరుపతి గౌడ్, బాబు, మూన్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

 

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

కల్తీ డీజిల్ పోశారంటూ వాహనదారుల ఆందోళన

రామానుజవరంలో గడపగడపకు పర్యటించిన మానవతారాయ్