in

శ్రీరామ మందిరంలో సామూహిక కుంకుమార్చన

శ్రావణమాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రీ హనుమాన్ చాలీసా భక్త బృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మాతలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మాతలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీలక్ష్మి అష్టోత్తరాన్ని పటిస్తూ కుంకుమార్చనను కొనసాగించారు. వైదిక క్రతువును సంగనభట్ల నరేంద్ర శర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామ మందిరమును సాంప్రదాయ బద్ధంగా అలంకరించారు. అమ్మవారి నామస్మరణతో మారు మోగింది. విచ్చేసిన మాతలకు తీర్థ ప్రసాదంతో పాటు కుంకుమార్చన నిర్వహించిన పసుపు, కుంకుమ అందజేసి ఆశీర్వచనం చేశారు.

[zombify_post]

Written by Gopi

రెచ్చిపోతున్న పేకాట ఆటగాళ్లు”

చంద్రబాబు కేసు.. తీర్పు ఇచ్చే జడ్జి వీరే