in , ,

మానవత్వం చాటుకుంటున్న ఎమ్మెల్యే రవిశంకర్ !*

  1. అనాధ పిల్లలకు అమ్మానానై                       అనాథ పిల్లలకు అండగా నిలుస్తున్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ .

    చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన సమత, మమతలు తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు.ఉండటానికి ఇల్లు లేదు.టెంటు క్రింద ఉండటంతో చెలించిపోయిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  తన 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఎన్నారైల సహకారంతో 15లక్షలు జమచేసి వారికి అందించారు.అంతే కాకుండా పెద్ద అమ్మాయికి మొగ్దుంపూర్ గురుకుల పాఠశాలలో ఉపాధి,ముగ్దుంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇల్లు ప్రభుత్వం తరపున ఇచ్చారు.చిన్న అమ్మాయి చదువుకోవడానికి కస్తూర్బా విద్యాలయంలో సీటు ఇప్పించారు.పెళ్ళికూడా దగ్గర ఉండి జరిపిస్తామని హామీ ఇచ్చారు.గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందిన రాజు,మనీషా ల తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథలుగా మారారు.తన దృష్టికి రావడంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  స్పందించి తన వంతు సహాయంగా 20వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఎన్నారైలు, స్థానిక ప్రజాప్రతినిధులు,వర్తకుల సహకారంతో, రైతు బీమా డబ్బులు కలిపి 7లక్షల రూపాయలు జమచేసి వారికి అందించారు.డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని, పెళ్లి చేస్తానని హామీ ఇచ్చారు. మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం ఏరడుపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారారని సోషల్ మీడియాలో చూసి చలించిపోయి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  తనవంతు 10వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ఎమ్మెల్యే రవిశంకర్ పిలుపునందుకొని అమెరికాలో ఉంటున్న ఎన్ ఆర్ ఐ పంజలా నరేష్-మధుప్రియలు వాళ్ళ వంతు 50, 000/–రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ, యూఎస్ఏ  లో ఉన్న మిగితా ఎన్నారై  ల ద్వారా 4, 50, 000/-రూపాయలు జమ చేసారు.సోషల్ మీడియాలో చొప్పదండి సుంకె రవిశంకర్  పిలుపుతో,పిల్లలపై మానవతా దృక్పథంతో 5 లక్షల రూపాయలు జమచేసి పంపించారు.చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ చేతుల మీదుగా నేడు శంకరపట్నం మండలం ఏరడు పల్లి కి చెందిన అభినయ,ఆలయ లకు అందించారు.బట్టలు పెట్టి, వారితో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసారు.

    *ఒంటరి అయిన చిన్నారికి  ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చేయూత*

    గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక అనన్య తేజ తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా, క్యాన్సర్ వ్యాధితో తల్లి మరణించింది అల్లారుముద్దుగా పెరగాల్సిన "అనన్య తేజ" తల్లిదండ్రులు లేని అనాధగా మిగిలింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వారి ఇంటికి వెళ్లి తక్షణ సహాయం కింద 20,000 రూపాయాలు అందజేసి పై చదువులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే సుంకే రవి శంకర్  హామీ ఇవ్వడం జరిగింది.

    *ట్విట్టర్లో పోస్ట్ చలించి వికలాంగులకు ఆర్థిక సాయం*

    బోయినపల్లి మండలం దేశాయి పల్లె గ్రామానికి చెందిన కళ్యాణం వేణు , సాగరిక అన్నా చెల్లెళ్ళు పుట్టుకతో వికలాంగులు కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్   ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపారు. ఆ పోస్ట్ కు స్పందించి ఈరోజు అతను కుటుంబానికి తక్షణ సహాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.బీసీ బందు ద్వారా అతనికి మరియు అతని సోదరునికి రెండు యూనిట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రవి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపడం జరిగింది.

    *మంగపేట ముంపు నిర్వాసితులకు పరిహారం మంజూరు*

    ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా  నారాయణపూర్ రిజర్వాయర్ గంగాధర ఎల్లమ్మ చెరువు క్రింద ముంపునకు గురవుతున్న  భూములకు ప్రభుత్వం 16.50 కోట్ల  పరిహారాన్ని మంజూరు చేసింది.2004లో అప్పటి టిడిపి ప్రభుత్వం  నారాయణపూర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా మంగపేట రైతులకు చెందిన దాదాపు 86 ఎకరాల భూమి ముంపునకు గురైంది.18 ఏళ్ల నుండి పరిహారం కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారాయి,, పాలకులు మారారు, ఎమ్మెల్యేలు మారిన మంగపేట నిర్వాసితులను పట్టించుకున్న వారు లేరు.
    ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కృషితో నేడు నిర్వాసితులకు పరిహారం మంజూరు అయింది.గంగాధర మండలం బూరుగుపల్లి లో  నిర్వాసితులకు 16.50 కోట్ల  రూపాయల విలువైన చెక్కును ఎమ్మెల్యే రవిశంకర్ అందజేశారు.పరిహారం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు కృషి చేసిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కు స్ధానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్  నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Written by Mahesh

రూ. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం”*

పొంగులేటి శిబిరం లో నయాజోస్