*వికలాంగులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే సంవత్సరకాలం 50 శాతం డిస్కౌంట్*
*వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలి వీరికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు*
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 24 మంది వికలాంగులను గుర్తించి సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి తన సొంత డబ్బులతో బస్సు పాసులు ఇప్పించడం జరిగింది. సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి మాట్లాడుతూ వికలాంగుల సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం ఆర్టీసీ బస్సులో వికలాంగులు ప్రయాణిస్తే 50% మాత్రమే డబ్బులు చెల్లించవలసి ఉంటుందని, వికలాంగుల కోసం ప్రతి బస్సులో ప్రత్యేక సీటు ఏర్పాటు చేయడం జరిగిందని, వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని వీరికి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ల్యాగల నారాయణ, చల్ల మహేందర్, పోచంపల్లి పోచయ్య, జక్కుల మహేందర్, షేక్ వాయిద్, వంగ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]

